Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -

జూ ఎన్టీఆర్ ‘రామాయణం’ సినిమాతో బాల రాముడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. టెంపర్ సినిమా నుంచి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వైవిధ్యమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంత అనేది ఓ సందర్భంలో తెలియజేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ‘నిన్ను చూడాలని’ సినిమాకి విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో నటించినందుకు తారక్ కేవలం 4 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట. అప్పటికి టీనేజ్ కూడా దాటని ఎన్టీఆర్ కి ఆ నాలుగు లక్షలు ఏమి చేయాలో తెలియక తికమక పడ్డారట. మొదట ఇంట్లో రహస్య ప్రదేశాల్లో దాచిన తారక్ బాత్ రూమ్ లో కూడా దాచిపెట్టే ప్రయత్నం చేసాడట.

ఆ తర్వాత కార్ లో దాచిపెట్టి.. చివరికి అది సేఫ్ ప్లేస్ కాదని అక్కడి నుంచి కూడా డబ్బు తీసేశాడట. చివరికి ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఎన్టీఆర్ తన తల్లికి ఆ డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చాడట. 4 లక్షల పారితోషకంతో కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొనే రేంజ్ కి వచ్చేసాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -