Sunday, May 11, 2025
- Advertisement -

రాంచ‌ర‌ణ్ సినిమాలో ఎన్టీఆర్‌?

- Advertisement -

రాంచ‌ర‌ణ్ సినిమాలో ఎన్టీఆర్ ఏంటీ అనుకుంటున్నారా! ఇదే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్‌ టీజర్‌ లతో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ ఓ రోల్ చేస్తున్నార‌ని ఫిలిమ్ న‌గ‌ర్‌ టాక్‌.సినిమా 1985 లో జరిగే కథ కావటంతో సినిమాలో అప్పటి రాజకీయాల ప్రస్థావన కూడా కనిపించనుందట. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రస్థావన సినిమాలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అప్ప‌టి ఎన్టీఆర్ పాత్ర‌కు జూ.ఎన్టీఆర్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే పొలిటికల్‌ సన్నివేశాలు సినిమాలో ఏమేరకు ఉంటాయన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అయితే వీరిద్ద‌రు రాజ‌మౌళి సినిమాలో మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -