Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పడానికి ఇదొక్క‌టి చాలు..!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్నాడు.షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే …తార‌క్ చాలా సింపుల్‌గా ఉంటాడు, అనేది చాలా త‌క్కువు మందికి తెలుసు.ఎన్టీఆర్ షూటింగ్ స‌మ‌యంలో అంద‌రితోను కలివిడిగా ఉంటాడు.షూటింగ్‌లో అంద‌రిపై జోక్స్ వేస్తు స‌రాదాగా గడుపుతాడు ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్‌కు తానుఓ స్టార్ హీరో అనే ఫీలింగ్ అస‌లు ఉండ‌దు.తాజాగా తారక్ వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెప్పే ఫోటో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.అర‌వింద స‌మేత షూటింగ్ ఉన్న ఎన్టీఆర్‌,షూటింగ్ గ్యాప్‌లో ఇదిగో ఇలా క్రింద కూర్చోని క‌నిపించాడు ఎన్టీఆర్‌.తాను కావాలి అనుకుంటే కూర్చిలో అయిన కూర్చోవచ్చు,కాని తాను అంద‌రిలాంటి వాడినేన‌ని తెలిపాడు ఎన్టీఆర్‌.ఒక హిట్ వ‌స్తే చాలు మేమే పెద్ద హీరోలుగా ఎగిరి ప‌డే ఈ రోజుల‌లో…ఎంత ఎదిగినా ఇలా ఒదిగి ఉండాలని ఎన్టీఆర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.ఇక ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో కూడా అంద‌రితోను క‌లిసిమెలిసి ఉంటాడు.

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చ‌ర‌ణ్‌,మ‌హేశ్ బాబులతో ఎన్టీఆర్‌కు మంచి స్నేహబంధం ఉంది.ఇటీవ‌లే ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.దీంతో అర‌వింద స‌మేత సినిమా ఆల‌స్యం అవుతుంద‌ని భావించారు.కాని త‌న వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌ద‌ని భావించిన ఎన్టీఆర్ తండ్రి చ‌నిపోయిన వారం రోజుల‌కే షూటింగ్‌లో పాల్గొన్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -