మొట్ట మొదటి తెలుగు రియాల్టీ షోగా వచ్చింది బిగ్‌బాస్. అప్పటికే పలు భాషలలో షో సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా మొదలుపెట్టారు నిర్వాహాకులు. బిగ్‌బిస్ మొదటి షోకు ఎన్టీఆర్‌ను వ్యాఖ్యతగా తీసుకోవడంతో షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందరి అంచనాలను నిజం చేస్తు బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను విజయవంతం చేశాడు ఎన్టీఆర్. వెండితెర మీదనే కాదు తాను బుల్లితెర మీద కూడా కింగ్‌నే అని నిరుపించుకున్నాడు ఎన్టీఆర్.
అయితే రెండో సీజన్‌కు వచ్చే సరికి అరవింద సమేత సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆ సీజన్‌కు దూరం అయ్యాడు. బిగ్‌బాస్ రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని యాకరింగ్ చేశాడు. అయితే ఎన్టీఆర్‌తో పోలిస్తే నాని యాంకరింగ్ తెలిపోయిందని చాలామంది కామెంట్స్ చేశారు. పైగా రెండో సీజన్ తీవ్ర విమర్శలను కూడా ఫేస్ చేసింది. దీంతో నాని ఇక మీద ఇలాంటి షోస్‌కు యాంకరింగ్ చేయనని తెల్చి చెప్పేశాడు. దీంతో మూడో సీజన్ ఎవరు యాంకరింగ్ చేస్తారనే ప్రశ్న అందరిలోను మొదలైంది. ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు కాబట్టి,అతను యాంకరింగ్ చేసే అవకాశాలు లేవనే భావనకు వచ్చేశారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
బిగ్‌బాస్ యాజమాన్యం ఎన్టీఆర్ మూడో సీజన్‌కు హోస్ట్ చేయమని అడగ్గా…రాజమౌళిని అడిగి చెబుతానని చెప్పాడట ఎన్టీఆర్. దీనిపై రాజమౌళితో చర్చించిన ఎన్టీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. వారానికి రెండు రోజులే కావడంతో ఎన్టీఆర్‌కు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట రాజమౌళి. ఇదే విషయాన్ని బిగ్‌బాస్ యాజమాన్యంకు తెలియజేశాడు ఎన్టీఆర్.దీంతో ఎన్టీఆర్‌ను మళ్లీ బిగ్‌బాస్‌లో చూడబోతున్నారు ప్రేక్షకులు. రాజమౌళి కూడా ఓకే చెప్పడంతో మూడవ సీజన్‌కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడం ఖాయం అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!