అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. ఎన్టీఆర్ చేతుల మీదుగానే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు …నేను ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు,కుటుంబ సభ్యుడిగా వచ్చానని తెలిపారు. నాగర్జున గారిని నేను బాబాయ్ అని పిలుస్తుంటాను.
నాగర్జున గారు కూడా అబ్బాయ్ అని పిలుస్తుంటారని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే వెంకీ అట్లూరి గురించి చెప్పాలి. సినిమాలలో ఎంట్రీ ఇవ్వకముందే నుంచే నాకు వెంకీ తెలుసు. తొలిప్రేమ సినిమాను అద్భుతంగా తీశాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ మజ్ను కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నా. నిర్మాత ప్రసాద్ గురించి చెప్పడానికి ఏముంది. ఆయనకు సినిమా అంటే వ్యామోహం. వచ్చిన ప్రతి రూపాయి సినిమాలోనే పెట్టాలని భావించే వ్యక్తి. ఈ సినిమా ఆయనకు తప్పకుండా విజయం సాధించి ,డబ్బులు బాగా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు ఎన్టీఆర్. చివరిగా నా తమ్ముడు అఖిల్ గురించి చెప్పాలి.
అఖిల్ సినిమాలు ఫెయిల్ కావచ్చు కాని, అఖిల్ ఫెయిల్ కాలేదని చెప్పాడు ఎన్టీఆర్. అఖిల్ గురించి చెప్పాలి అంటే అతనికి ఉన్న ఒక మంచి గుణం గురించి చెప్పాలి. ఒక మనిషికి ఆత్మ విమర్శ చేసుకోవాలంటే చాలా దమ్ముండాలి. తనను తాను మార్చుకుంటూ. తన ఆలోచనను మార్చుకుంటూ వెళుతూన్నాడు. అఖిల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ గా నిలుస్తాడు. అది కూడా ఈ సినిమాతో జరుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!