యంగ్ ఎన్టీఆర్‌కు సినిమాలు తప్ప మరో లోకం తెలియదు. చేస్తే సినిమాలు చేస్తాడు, లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి సమయం కేటాయిస్తాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ కొత్తగా వ్యాపార రంగంలోకి దిగాడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే తోటి హీరోలు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. మహేశ్ సొంతం నిర్మాణ సంస్థతో పాటు సినిమా మాల్ కూడా కట్టి రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ కూడా హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ కట్టడానికి రెడీ అవుడుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా వ్యాపార రంగంలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నాడు.
ఎన్టీఆర్ కూడా మహేశ్ బాబులా మల్టీప్లెక్స్ కట్టాలని చూస్తున్నాడు. అయితే ఇది హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయలని భావిస్తున్నాడు. దీనికి సంబంధించి తన టీమ్‌ను కూడా ఏపీకి పంపించినట్లు సమాచారం. ముందుగా అమరావతి లేక విశాఖపట్నం వంటి నగరాల్లో బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే తాను ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను తన మల్టీప్లెక్స్‌లో విడుదల చేయలని భావిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ కొత్త వ్యాపారం ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
- Advertisement -
కొత్త వ్యాపారం మొదలుపెట్టిన ఎన్టీఆర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -