Monday, April 29, 2024
- Advertisement -

మళ్ళీ ఫెయిల్ అయిన విక్రమ్ ఫార్ములా

- Advertisement -

గత కొంతకాలంగా సౌత్ స్టార్ చియాన్ విక్రం కి ఇటు తెలుగులో మరియు అటు తమిళ్లో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. పైగా తెలుగులో విక్రమ్ మార్కెట్ అయితే మరీ దారుణంగా ఉంది. తాజాగా చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ సినిమా ‘కదరం కొండన్’ తెలుగులో ‘మిస్టర్ కేకే’ అనే టైటిల్ తో అదే రోజు విడుదలైంది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కూడా బాగానే చేసినప్పటికీ తెలుగులో ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. తెలుగులోనే కాక తమిళం లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. చివరికి తమిళ్ క్రిటిక్స్ కూడా సినిమా ఏమాత్రం బాలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కథలో ఏమాత్రం కొత్తదనం లేదని ఇలాంటి అవుట్ డేటెడ్ కథలు ప్రేక్షకులు చూడటం ఎప్పుడో మానేశారు అంటూ విక్రమ్ మరియు చిత్ర బృందం పై క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. నటుడిగా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ విక్రం స్క్రిప్ట్ సెలక్షన్ ఏమాత్రం బాగా లేదని కొందరు అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. నిజానికి కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాలో కమల్ హీరోగా నటించాలి కానీ విక్రమ్ కు అవకాశం ఇచ్చారట. సినిమానే బాగా లేనప్పుడు అది కమల్ హాసన్ చేసినా విక్రమ్ చేసిన ఒక్కటేనని మరికొందరు తిట్టిపోస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -