బుల్లితెర హాట్ పెయిర్ అనగానే అందరిగా మొదటిగా గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిలే. అంతలా వీరు బుల్లితెర మీద హిట్ అయ్యారు. ఈటీవీ ఛానెల్లోప్రసారమయ్యే జబర్థస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరు తరువాత కాలంలో పలు షోలు చేస్తు మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇక వీరి మీద వచ్చినన్ని రూమర్స్ …హీరో, హీరోయిన్స్ మీద కూడా రాలేదంటే అర్థం చేసుకోవాలి. రష్మి, సుధీర్‌ల మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. కాని వీరిద్దరు మాత్రం అలాంటిది ఏమి లేదని,జస్ట్ స్క్రిప్ట్ ప్రకారమే అలా నటిస్తున్నాం అని ఎన్నిసార్లు చెప్పిన ఆ మాట ఎవ్వరికి నమ్మబుద్ది కావడం లేదు.
సుధీర్ రష్మికి పలు సందర్భలలో ప్రపొజ్ చేసిన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి రష్మి ,సుధీర్‌లు తమ ప్రేమకు ఢీ షోని వేదికగా చేసుకున్నారు. వచ్చేవారం జరిగే ఎపిసోడ్ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో సుధీర్ రష్మి చేయి పట్టుకుని మరి ప్రపొజ్ చేశాడు. ఓ సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయడం కూడా మనం ఈ ప్రొమోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రొమో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మరి కావాలనే ఇలా స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తున్నారో, లేక నిజమైన ప్రేమలో ఉన్నారో వారే తెలియజేయాలి.
- Advertisement -
మరోసారి రెచ్చిపోయిన రష్మి, సుధీర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -