- Advertisement -
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారింది. ఎన్టీఆర్ ,రామ్ చరణ్,అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది రకుల్. అయితే ఇండస్ట్రీకి కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో రేసులో బాగా వెనకపడింది రకుల్. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనర్హం. అయితే రకుల్‌కు ఓ శుభవార్త చెప్పారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం వంటి హిట్ తరువాత సుకుమార్ మహేశ్‌తో సినిమా ఓకే చేశాడు సుకుమార్.
ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్దం అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. మహేశ్ బాబు,రకుల్ గతంలో ‘స్పైడర్ సినిమాలో నటించారు. ఈ సినిమా సరైన విజయం సాధించలేదు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?