గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నటి శ్రీరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చింది.వచ్చి రావడమే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తన ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసింది.ఒకవైపు పవన్ కళ్యాణ్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ నిర్మాణం ఉంటుందంటూ ప్రజలతో మమేకం అవుతూ బస్ యాత్రలు చేస్తుంటే,అది జనసేన కాదు కులసేన అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు శ్రీరెడ్డి.ఇంతకి శ్రీరెడ్డి ఏమన్నారంటే..జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కొన్ని పదవుల్ని కేటాయించారు. అయితే అవి కులాలకు అతీతంగా కేటాయిస్తే బాగుండేది. వాటిలో పవన్ ఫ్యాన్స్‌కి కూడా కొన్ని పదవులు కేటాయిస్తే బాగుండేది.నేను ఎందుకు ఇలా అన్నాను అంటే దానికి కారణం ఉంది అని పెద్ద లిస్టే చెప్పింది శ్రీరెడ్డి.
1. జనసేన పార్టీ అధ్యక్షుడు – పవన్ కళ్యాణ్ (కాపు) ,
2. జనసేన కో ఆర్డినేటర్ – మాదాసు గంగాధరం (కాపు) ,
3. జనసేన అధికార ప్రతినిధి – తోట చంద్రశేఖర్ (కాపు) ,
4. జనసేనా కోశాధికారి – మారిశెట్టి రాఘవయ్య (కాపు) ,
5. జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ – అద్దేపల్లి శ్రీధర్ (కాపు) ,
6. మరో స్పోక్స్ పర్సన్ – పార్థసారథి (కాపు),
7. జనసేనా మీడియా ఇంచార్జ్ – పసుపులేటి హరిప్రసాద్ (కాపు),
8. జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్ – కిరణ్ (కాపు),
9. జనసేన కృష్ణా – గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జ్ – ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు)
ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులను కాపు నాయకులతో జనసేన పార్టీని నింపేశారు. మా పార్టీ కులాలకు అతీతం చెబుతున్న పవన్ దీనిపై ఏం సమాధానం చెబుతారు పీకే గారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.శ్రీరెడ్డి పోస్ట్‌పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీలో కమ్మ కులస్తులు లేరా, వైసీపీలో రెడ్డి కులస్తులు లేరా ఆ లిస్ట్‌లో ఎంత మందికి సొంత కులస్తులకు ఎన్నిపదవులు ఇచ్చారు.. బయట కులస్తులకు ఎన్ని పదవులు కట్టపెట్టారు.ఇప్పటికైనా శ్రీరెడ్డి పవన్‌పై తన వాఖ్యలను ఆపాలి అని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.