- Advertisement -

ఒక్కదానివే రావాలి అన్నారు.. : హీరోయిన్ అంకిత కామెంట్స్

- Advertisement -

4 లెటర్స్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అంకిత మహారానా. ఇక తన రెండో సినిమా ఊల్లాల ఊల్లాల చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పుట్టింది ఒడిస్సాలో అయినా చదువుకుది మాత్రం బెల్గాంలో.

దాదాపు పద్దెనెమిదేళ్లు అక్కడే ఉన్నామని తెలిపింది. అయితే అక్కడ మాత్రం ఒక్క అవకాశం కూడా రాలేదని చెప్పుకొచ్చింది. కన్నడ అమ్మాయిలకు అక్కడ ప్రాధాన్యమిస్తారని పేర్కొంది. అయితే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో చాలా ఆఫీస్ ల చుట్టు తిరిగాను. ఎక్కడికి వెళ్లినా నాన్నను తీసుకెళ్లేదాన్ని అని తెలిపింది. ఇలా అందర్నీ తీసుకురావద్దు.. ఒంటరిగా రావాలని అనేవారు.. దీంతో భయమేసి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడకు వచ్చానని అంది. టాలీవుడ్ మాత్రం అలా కాదని.. ఇక్కడ చాలా బాగుందని చెప్పింది.

ఇక్కడి దర్శకులు తనను ఓ స్టార్ లా చూశారని తెలిపింది. ఈ ఫీల్డ్‌లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వస్తుందని తెలుసని, అయితే ఏది చేసినా అందరూ మెచ్చుకునేలా ఉండాలని తెలిపింది. కన్నడలో ఒంటిరిగా రావాలని అన్నారు. కానీ ఇక్కడి దర్శకులు ఎక్కడీకి వెళ్లిన ఎవరినో ఒకర్ని తోడు తీసుకెళ్లామని సలహా ఇచ్చారని చెప్పింది. అందుకే తాను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట పెట్టుకుని వెళ్తానని అంకిత మహారానా చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -