Sunday, May 12, 2024
- Advertisement -

‘ఊపిరి’ ట్రైలర్ అదిరింది!

- Advertisement -

‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సూపర్ హిట్ చిత్రంతో 50 కోట్ల క్లబ్ లో చేరిన కింగ్ నాగార్జున, కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్ లో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బృందావనం’, ‘ఎవడు’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఊపిరి’.

డబ్బే సంతోషం తెస్తుందంటే నాకంటే ఎవరు సంతోషంగా ఉండరు అనే హ్యాండికేప్డ్ బిలియనీర్, డబ్బులు ఉంటే చాలు ఎలాగైన బ్రతికేయొచ్చు అనుకునే అబ్బాయి ఈ ఇద్దరి మధ్య సాగే కథే ఈ సినిమా. దర్శకుడు వంశీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు అని చెపుతున్నారు. ఈ రోజే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

మంచి డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మొదలయిన ఈ ట్రైలర్ చాలా ఎమోషనల్ ఉంది. కార్తీ, నాగర్జున చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ, ఎమోషన్స్, హార్ట్ టచింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ను ఇరగదీసారు. ట్రైలర్‍కి మంచి స్పందన వస్తుంది. ట్రైలరే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక సినిమా ఏ రేంజ్‍లో ఉంటుందో ప్రతేకంగా చెప్పకర్లేదు.

{youtube}v=e1ddsJ38D5Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -