Friday, May 9, 2025
- Advertisement -

దుమ్ము రేపుతున్న మ‌హ‌ర్షి పాల పిట్ట సాంగ్‌

- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘మహర్షి’ వచ్చేనెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మ‌హేశ్‌కు జోడీగా పూజా హెగ్డే క‌థానాయ‌కిగా న‌టిస్తోంది.మహర్షి’ నుంచి ఐదో పాట ‘పాలపిట్టలో వలపు’ను సోమవారం విడుదల చేశారు. మహర్షి’ సినిమా నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మహర్షి’ నుంచి ఐదో పాట ‘పాలపిట్టలో వలపు’ను సోమవారం విడుదల చేశారు.

పాలపిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే .. పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే .. తేనె పట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే” అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. యూత్ కి .. మాస్ ఆడియన్స్ మనసుకి పట్టే బీట్ తో ఈ పాట పరుగులు తీస్తోంది.మణి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, ఎం.ఎం.మానసి ఆలపించారు.మహేష్‌బాబుకు ఇది 25వ చిత్రం కావడంతో అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ‘మహర్షి’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -