డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ లో హిట్ లు ఉన్నాయా ఫట్ లు ఉన్నాయా అనేది కనీసం పట్టించుకోకుండా డేట్ లు ఇస్తూ ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు
అని మన రిపోర్ట్ లు తెలుపుతున్నాయి , పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి నచ్చినా ప్రపంచానికి నచ్చని పంజా సినిమా ఎంతటి దారుణమైన పరాజయం అయ్యిందో చెప్పనక్కరలేదు, కొమరం పులి మిగిల్చిన చేదు అనుభవాలను పవన్ ఈ సినిమా తో రెట్టింపు చేసాడు, తమిళ దర్శకుడు విష్ణు దర్సకత్వం లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగినా అంతా బాలు సినిమా తో పోల్చడం వల్ల ప్లాప్ అయ్యింది అంటూ ఉంటారు.
అయితే ఈ సినిమా కి సీక్వెల్ చేస్తున్నారు అంటే ఫాన్స్ ఏమైపోతరో? అవును నిజంగా పవన్ పంజా పార్ట్ 2 కి సంబంధించి స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటున్నారు. . కాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న విష్ణు ఈ సినిమా ని చాలా పకడ్బందీ గా తీసే ఆలోచన లో ఉన్నాడట.
పంజా అభిమానులని ఆకట్టుకోలేక పోవడం తో అప్పటి నుంచీ తెలుగు సినిమాల వైపు చూడని విష్ణు ఇప్పుడు తాజాగా తెలుగు లో తన ప్రయత్నాలు మొదలెట్టాడు, మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం పవన్ వెంటే పడుతున్నాడు.