- Advertisement -

నటి పాకీజాకు పవన్‌ ఆర్థిక సాయం

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచిమనసు చాటుకున్నారు. తాజాగా నటి పాకీజాకు తనవంతు సాయం అందించారు. కొన్ని రోజుల క్రితం పొట్టకూటి కోసం తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది పాకీజా.ఈ వీడియోను చూసి చలించి పోయిన పవన్ ఆమెకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ రూ.2 లక్షల చెక్కును ఇవాళ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నటి వాసుకి(పాకీజా)కు ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు అందజేశారు.

చిన్నవాడైనా సరే పవన్ కల్యాణ్ తన ముందుగా ఉంటే ఆయన కాళ్లకు నమస్కారం పెట్టేవాడిని అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోగ్వేదానికి లోనయ్యారు. 50 సినిమాలకు పైగా నటించింది పాకీజా.

కొన్నేళ్లుగా నాకు సినిమాలు రావడం లేదు. షూటింగ్‌లు లేవు. చెన్నై నుంచి సొంతూరు కరైకుడికి వెళ్లిపోయాను. సాయం కోసం రెండు సార్లు విజయవాడకి వచ్చాను. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరినీ వేడుకుంటున్నాను. దయచేసి ఆదుకోండి. మీ కాళ్లు పట్టుకుంటాను.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు. ప్రభుత్వం తరుపున సాయం చేయాలని వేడుకుంటున్నా అని వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు పాకీజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -