Sunday, May 12, 2024
- Advertisement -

పవన్‌తో పోటీకి బన్నీ సై……. ఈ సారి పోటీ అక్కడ…… గెలుపెవరిదో?

- Advertisement -

మెగా హీరోలు అందరి విషయం ఎలా ఉన్నా బన్నీ మాత్రం పవన్‌తో విభేదిస్తున్నాడు. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ హంగామా బన్నీని ఇరిటేట్ చేస్తోంది. అందుకే ఇప్పటికే చాలా సార్లు క్లాస్ తీసుకున్నాడు బన్నీ. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం బన్నీని ఇంకా రెచ్చగొడుతున్నారు. అన్నింటికీ మించి పవన్ వ్యవహారం కూడా బన్నీని రెచ్చగొడుతున్నట్టే ఉంది. రీసెంట్‌గా తన మూడు రోజుల పొలిటికల్ షోలో కూడా అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్‌ని తీవ్రస్థాయిలో విమర్శించాడు పవన్. ప్రజారాజ్యం పాపాన్ని ఆయన నెత్తినే వేసేశాడు. నిజానికి ఓడిపోయాక కూడా చివరి వరకూ చిరంజీవిని నమ్ముకున్నది అరవింద్ ఒక్కడే. పార్టీ ఓడిపోయిన వెంటనే చిరంజీవికి మొదటగా దూరం జరిగిన వ్యక్తి పవన్, ప్రజారాజ్యాన్ని వదిలేసింది పవన్. అలాగే చిరంజీవి మెగా స్టార్ అవ్వడంలో అల్లు అరవింద్ పాత్ర అంతా ఇంతా కాదు. కెరీర్ స్టార్టింగ్‌లో పవన్‌కి అల్లు అరవింద్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. అలాగే జల్సా వరకూ కూడా అండగా ఉన్నాడు. కానీ పవన్ మాత్రం అదంతా మర్చిపోయి ప్రజారాజ్యం పార్టీ వైఫల్య భారాన్ని అరవింద్ పైన వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అల్లు అర్జున్‌కి మండుతోంది. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా బన్నీని ఇరిటేట్ చేస్తున్నారు. పవన్ కూడా దాసరి నారాయణరావు పార్థివ దేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా తన ఫ్యాన్స్‌ అరుపులు, కేకలను ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీ జనాల చేత విమర్శలు ఎదుర్కున్నాడు. బన్నీ మాత్రం అరవొద్దని చెప్పి ఫ్యాన్స్‌కి చెప్పి హుందాగా ప్రవర్తించాడు. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.

ఇప్పుడు మరోసారి పవన్‌తో బన్నీ పోటీ అనే పరిస్థితి వస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అజ్ఙాత వాసి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే అదే డేట్‌కి నా పేరు సూర్య…… నా ఇల్లు ఇండియా టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు. అజ్ఙాతవాసి రెండు ఇంగ్లీష్ సినిమాల నుంచి కాపీ చేసిన షాట్స్ పక్కన పెడితే మిగతా ట్రైలర్ అంతా కూడా అత్తారింటికి దారేదిలానే ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. కానీ బన్నీ ‘నా పేరు సూర్య…….నా ఇల్లు ఇండియా’ టీజర్ మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటుందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బోర్డర్ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చెప్తున్నారు. ఇక అజ్ఙాతవాసి ట్రైలర్‌లో పవన్ కూడా కొత్తగా చేయబోయేది ఏమీ ఉండదు. నా పేరు సూర్య టీజర్‌లో మాత్రం సరికొత్త బన్నీని చూడడం ఖాయం. హెయిర్ స్టైల్‌తో సహా చాలా మార్పులతో సరికొత్తగా కనిపించనున్నాడు బన్నీ. ఇక అజ్ఙాతవాసి ట్రైలర్, బన్నీ టీజర్‌లకు లైక్‌లు, వ్యూస్ విషయంలో సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేగడం ఖాయం. డిజెకి అన్లైకులతో హోరెత్తించారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు పవన్-బన్నీ సినిమాల ట్రైలర్, టీజర్…..ఒకే రోజు ఒకే టైంకి రిలీజ్ అవుతుండడంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఇంకెంత రెచ్చిపోతారో……..ఏ స్థాయిలో తిట్టుకుంటారో చూడాలి. సినిమా స్టార్స్ మూఢాభిమానుల మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో కూడా కొత్త సంవత్సరం రోజే సరికొత్తగా కనిపించడం ఖాయమని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -