Wednesday, May 7, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి కొత్త అత్తారిల్లు

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాన్ సినిమా అంటే టాపు లేచిపోయే కలక్షన్ లు రావాల్సిందే. అత్తారింటికి దారేది సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ రికార్డ్ గా ఉండిపోగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలిసి మళ్ళీ ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నారు.

అప్పట్లో అతడు , ఖలేజా , జులాయి లాంటి సినిమాలు తీసిన త్రివిక్రముడు ఇప్పుడు నెమ్మదిగా ఫామిలీ సెంటిమెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. పూర్తి స్వచ్చమైన వినోదాన్ని అందిస్తూ డబల్  మీనింగ్ కామెడీ లేని పూర్తి కుటుంబ కథా చిత్రాలకి కేరాఫ్ గా మారాడు త్రివిక్రమ్. నితిన్ – సమంత ల కాంబినేషన్ లో వచ్చిన అ ఆ ఎంత బాగా జనాలకి నచ్చిందో తెలిసిన విషయమే ఈ దెబ్బతో అలాంటి సినిమాలనే చెయ్యాలి అని త్రివిక్రమ్ ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ కూడా దారుణమైన ప్లాపులలో మునిగిపోయి త్రివిక్రమ్ మాత్రమే తనని సరిగ్గా ఫోకస్ చెయ్యగలడు అని నమ్ముతున్న నేపధ్యం లో ఈ సినిమా కి శ్రీకారం చుట్టబోతున్నారు . అత్తారింటికి దారేది లాంటి హెవీ సెంటిమెంట్ కథనే ఈ సారి కూడా తీసుకున్న త్రివిక్రమ్ అలాంటి సినిమానే చెయ్యాలని చూస్తున్నారట . ఇప్పటికే ఓ లైన్ కూడా ఫిక్స్ చేసుకొని దాన్ని వర్కవుట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -