వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు పవన్. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు,OG వీటితో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు పవన్. ఇక OG విషయానికొస్తే గ్యాంగ్‌స్టర్ కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. పంజా తర్వాత పవన్ ఇలాంటి కథతో సినిమాలు చేయలేదు. దీంతో OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యారు. రీసెంట్‌గా నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది.
ఇక పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సినిమా కథకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ముంబైని చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి.. అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్ స్టర్‌గా మారి మాఫియాలోకి వెళ్తాడట. ఆ ప్రయాణంలోనే అతని ఫ్యామిలీని కోల్పోగా ఆ తర్వాత వారి మీద పగ తీర్చుకుని డ్రగ్స్ మాఫియాను అంతం చేస్తాడట.
దీంతో నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రామ రామ కృష్ణ కృష్ణ కథకు కాస్త మార్పులు చేసి క్యారెక్టర్‌ని చేంజ్ చేసి తెరకెక్కిస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకింగ్ కొత్తగా ఉంటుందని చెబుతున్నా కథ పాతదే అయితే OG ఫ్లాప్ అవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా తమిళ్ స్టార్స్ అర్జున్ దాస్, శ్రియారెడ్డి ,బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ పోషిస్తున్నారు.