Tuesday, May 13, 2025
- Advertisement -

భావోద్వేగంతో చేసిన‌ ట్వీట్ పవన్

- Advertisement -

శ్రీరెడ్డి వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నోరు విప్పారు. తన తల్లిపై చేసిన విమర్శలతో కలత చెందిన ఆయన తీవ్ర వేదనతో స్పందించారు. నా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే చనిపోవడమే ఉత్తమమంటూ భావోద్వేగంతో స్పందించారు. సోషల్ మీడియా వేదిక ఆయన తన మనో వేదనను పంచుకున్నారు. స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? అని పవన్ ప్రశ్నించారు.

మీరందరూ కలిసి నా కన్నతల్లిని ఎవరికీ ఉపకారం తప్ప అపకారం చేయాలనే ఆలోచనే రాని నా తల్లిని.. నడి రోడ్డు మీద ఏ కొడుకూ వినకూడని తప్పుడు పదాలు అనమని సలహాలు ఇచ్చారు. ఒకరితో ఆ మాట అనిపించి, దాన్ని పదే పదే ప్రసారం చేసి తర్వాత దానిపై డిబేట్లు పెట్టే స్థాయికి మీరు దిగజారారు. అలాంటప్పుడు ముక్కు పచ్చలారని పిల్లలపై అత్యాచారాలు చేసే నీచ నికృష్టులు ఎందుకు ఉండరు. కోకొల్లలుగా ఉంటారంటూ పవన్ ఆవేదనతో ట్వీట్ చేశారు.

ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చనిపోవడానికి నేను సిద్ధమే. ఈ పోరాటంలో ఒకవేళ నేను మరణిస్తే.. ‘నిస్సహాయులకు ఎంతో కొంత అండగా.. అధికారం, అండదండలు ఉన్న వారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు’ అని పవన్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.నటుడిగా మారక ముందే, రాజకీయ పార్టీ నాయకుడిగా అవతరించక ముందే నేను కొడుకును. ఓ కొడుకుగా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే.. నేను చనిపోవడమే ఉత్తమం అంటూ పవన్ ట్వీట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -