తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ను క్యాష్ చేసుకొనే వారికి కొదవలేదు. ప్రత్యేకంగా అభిమానగణాన్ని కలిగి ఉన్న పవర్ స్టార్ పేరును చెబుతూ.. ఆయన మ్యానరిజమ్స్ ను అనుకరిస్తూ… క్యాష్ చేసుకొనే యత్నాలు ఇవి. ఇలాంటి ఫీట్లు చాలా మంది చేస్తూనే ఉన్నారు. మరి ఆ బ్యాచ్ లో ఇప్పుడు మరో వ్యక్తి ఎంటరయ్యాడు… ఆయనే.. దర్శకుడు పూరి జగన్నాథ్.
తన తాజా సినిమా “జ్యోతిలక్ష్మి” లో పవన్ స్మరణ చేస్తున్నాడు జగన్. తన హీరోయిన్ చార్మి చేత పవర్ స్టార్ డైలాగ్ ను చెప్పిస్తున్నాడితను. “ఏయ్ ..రాస్కోరా సాంబా’ అంటూ ‘జ్యోతిలక్ష్మి’లో చార్మికి డైలాగ్ పెట్టాడట పూరి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. మరి ఈ డైలాగ్ ఎంత హిట్టో వేరే చెప్పనక్కర్లేదు.
“గబ్బర్ సింగ్” సినిమాలో సూపర్ హిట్ అయిన ఈ డైలాగ్ నే పూరి తన సినిమాలో చార్మి చేత చెప్పిస్తున్నాడు. ఇదంతా పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకోవడానికి.. వారిని తన సినిమా వైపు రప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడేనని వేరే చెప్పనక్కర్లేదు!