Monday, May 13, 2024
- Advertisement -

పాయ‌ల్ రాజ్ పుత్ అయిన బెల్ల‌కొండ‌కు హిట్ ఇస్తుందా..?

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిట్లు రాక‌పోయిన వ‌రుస సినిమాల‌లో న‌టిస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీత అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగర్వాల్ న‌టిస్తోంది. ఈ సినిమా త‌రువాత త‌మిళ సూప‌ర్ హిట్ మూవీని రీమేక్ చేసే ప‌నిలో ప‌డ్డాడు బెల్ల‌కొండ‌. త‌మిళంలో ‘రాక్షసన్స సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మ‌నోడు మ‌రో మూవీకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

సువర్ట్ పురానికి చెందిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా సినిమా తీయబోయే సినిమాలో బెల్లంకొండను హీరోగా తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాకు వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్న్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తుంది. ఇప్ప‌టికే పాయ‌ల్ నాగ్ , వెంకీ సినిమాల‌తో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌వితేజ‌తో కూడా డిస్కోరాజా సినిమాలో న‌టిస్తోంది. ఇలా వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది ఈ బోల్డ్ బేబీ. మ‌రి పాయ‌ల్ అయిన బెల్ల‌కొండ‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -