Friday, May 17, 2024
- Advertisement -

త్రివిక్రమ్‌ను డాడీ అని పిలుస్తా

- Advertisement -

పీటర్‌ హెయిన్స్ ఈ పేరు తెలియ‌ని వాళ్లు ఉండ‌రు ఎందుకంటే సినిమా ప్రేక్ష‌కులంద‌రికి ఈ పేరు సుప‌రిచిత‌మే.తెలుగులోనే కాకుండా సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తంలో ఫేమస్‌ స్టంట్‌ కొరియోగ్రఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు పీటర్‌ హెయిన్స్ .ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు.

త‌న చిన్న‌త‌నం గురించి సినీ జీవితం గురించి ఆ ఇంటర్వ్యూ చేప్పాడు పీట‌ర్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ సస్సెస్‌ఫుల్‌ స్టంట్స్‌ మాస్ట‌ర్‌గా దూసుకు పోతున్న పీటర్‌ హెయిన్స్‌కు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్ అంటే ఎన‌లేని అభిమానం. అంతేకాదు త్రివిక్రమ్‌ని త్రివిక్రమ్‌ను డాడీ అంటూ సంభోదిస్తాడట పీటర్‌ హెయిన్స్‌.

తన తండ్రి తనకు ఫైట్స్‌ నేర్పిస్తే త్రివిక్రమ్‌ సినిమా అంటే ఏంటీ, అసలు సినిమాలో ఫైట్స్‌ గురించి చెప్పడం వల్లే ఆయన్ను తాను డాడీ అంటూ పిలుస్తాను అంటూ పీటర్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఒక గొప్ప దర్శకుడు అంటూ పీటర్‌ హెయిన్స్‌ కితాబు ఇచ్చాడు. పలు సినిమాలు చేస్తున్నా కూడా వీరిద్దరి నుండి పిలువు వస్తే ఖచ్చితంగా వెళ్తాను అని, తెలుగులో వీరిద్దరు అంటే తనకు అమితమైన ఇష్టం మరియు అభిమానం అంటూ పీటర్‌ చెప్పుకొచ్చాడు. స్టంట్స్‌ మాస్టర్స్‌లలో ఎక్కువ గుర్తింపు దక్కించుకున్న వ్యక్తిగా పీటర్‌ హెయిన్స్‌ నిలుస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -