Saturday, May 10, 2025
- Advertisement -

ప‌వ‌న్‌కు పాట అంకితం చేసిన పోలండ్ బుడ్డోడు

- Advertisement -

‘కొడకా కోటేశ్వరరావు’ పాట యూట్యూబ్‌లో వారం రోజులుగా ట్రెండింగ్‌గా ఉంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాట‌ను ఓ పొలాండ్ బుడ్డోడు పాడి ప‌వ‌న్‌ను ఆక‌ట్టుకున్నాడు. దీంతో ‘హే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పాట పాడి విడుద‌ల చేశారు. నా స్టైల్‌లో ఈ పాట పాడి నేను మీకు ఇస్తు కానుక ఇది.’ అంటూ పవన్‌కు ట్వీట్‌ చేశాడు. అది చూసిన పవన్ స్పందించాడు. ‘మై డియర్‌ లిటిల్‌ ఫ్రెండ్‌..ఈ కొత్త కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ సందేశం నాకు అందింది. గాడ్‌ బ్లెస్‌యూ’ అని ట్వీట్‌ చేశారు.

ఆ లిటిల్ ఫ్రెండ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అభిమానంతో ఓ పాట‌ను అంకితం చేశాడు. అత‌డు తెలుగులో పాట రచించి స్వ‌యంగా పాడి విడుద‌ల చేశారు. పోలండ్‌కు చెందిన బిగ్నీవ్ చెర్టలూర్ (Zbigniew A. Chertlur) ఏడేళ్ల పిల్లాడు ప‌వ‌న్‌కు వీరాభిమానిగా మారాడు. బుజ్జిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇప్పుడు ఈ పాట విడుద‌ల చేయ‌డంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా చేస్తున్నాడు.

ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శరత్ చేర్తులూరు అనే వ్యక్తి కుమారుడుఉ బిగ్నివ్ చెర్ట‌లూర్‌. అతడి తల్లి పొలండ్ దేశస్తురాలు ఉర్సులా ఎలిజ్బెతియా. వీరు అక్క‌డే నివ‌సిస్తూ తెలుగు రాష్ట్రాల‌పై ఇంకా అభిమానం పెంచుకున్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా వ‌స్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -