Sunday, May 12, 2024
- Advertisement -

అద్భుతంగా పాట పాడిన పోలండ్ పోర‌డు

- Advertisement -

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న సినిమా హ‌లో. ఈ సినిమా డిసెంబ‌ర్ 22వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనికోసం చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన మెరిసే మెరిసే సినిమా పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతంతో కూడిన పాట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది.

పాట‌కు అనుగుణంగా అఖిల్‌, హీరోయిన్ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ డ్యాన్స్ చేస్తుంటారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. అయితే ఈ సినిమాపై ఓ పోలాండ్ పోర‌డు ముచ్చ‌ట‌ప‌డ్డాడు. ఆ పాట‌ను క‌ష్ట‌ప‌డి నేర్చుకుని సినిమాలో ఉన్న మాదిరి డిట్టో పాడి అబ్బుర‌ప‌రిచాడు. ఆ పిల్లాడి పేరు జిబిగ్జ్‌. వెనుక హ‌లో సినిమా పాట వ‌స్తుంటే అత‌డు పాడుతున్న వీడియోను త‌న ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. పాట బాగా ఉంద‌ని, అఖిల్‌ డ్యాన్స్‌ అద్భుతంగా ఉందని ట్విట‌ర్‌లో చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అందుకోవాల‌ని ఆకాంక్షించారు.

ఈ పిల్లాడి పాడిన పాట వీడియో చూసిన అక్కినేని నాగార్జున ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. పిల్లాడిని అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. వెంట‌నే రీట్వీట్ చేశాడు.

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -