నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా కొందరు టార్గెట్ చేస్తున్నారా.. అంటే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పవన్ రాజకీయలలోకి వచ్చిన దగ్గర నుంచి కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు సైతం పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేశారు. తాజగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ విమర్శల దాడిని మరింత ఉదృతం చేయలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్‌కు గతంలో నటి పూనమ్ కౌర్‌తో ఎఫైర్ ఉందని ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. దీన్ని బలపలరిచేలా పూనమ్ కూడా పవన్ గురించి తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో కొన్ని పోస్ట్‌లు పెట్టింది. గత ఎన్నికలలో పవన్ టీడీపీకి మద్దతిచ్చిన సంగతి తెలిసింది. దీనికి ప్రతిఫలంగా పూనమ్ కౌర్‌ను ఏపీకి బ్రాండ్ ఆంబాసిడర్‌గా నియమించింది టీడీపీ ప్రభుత్వం. ఇది అప్పట్లో ఇష్యూగా కూడా మారింది. ఇప్పుడు మళ్లీ పవన్ టార్గెట్ చేయడంతో పూనమ్ కౌర్ తెర మీదకు వచ్చింది.
పవన్‌ను టార్గెట్ చేసే క్రమంలో పూనమ్‌ను సంప్రదించారట కొందరు రాజకీయ నాయకులు. పవన్, పూనమ్‌లకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విఫయాలు ఓ పెన్‌డ్రైవ్‌లో ఉందని ,వాటిని తమకు ఇస్తే 15 కోట్లు ఇస్తామని పూనమ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారట సదరు రాజకీయ నాయకులు. అయితే పూనమ్ ఈ వివాదానికి దూరంగా ఉండాలని అనుకుంటోందని తెలుస్తోంది. ఈ వివాదానికి పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తోంది. మరి ఈ ఆఫర్‌పై పూనమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు