Saturday, May 10, 2025
- Advertisement -

హాట్ లుక్‌తో మ‌త్తెక్కిస్తున్న పూజా హెగ్డె

- Advertisement -

పూజా హెగ్డె…కెరీర్ తొలినాళ్లల్లో హీరోయిన్‌గా తెగ క‌ష్టాలు ప‌డింది. తెలుగులో ముకుందా సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది. త‌రువాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఒక లైలా కోసం అనే సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు యావ‌రేజ్‌గానే ఆడాయి. ఇదే స‌మయంలో బాలీవుడ్‌లో హృతిక్‌తో సినిమా చేసే ఛాన్స్ రావ‌డంతో ఇక్క‌డి సినిమాల‌ను వ‌దిలేసి మోహింజ‌దారో సినిమాలో న‌టించింది. ఈ సినిమా విడుద‌ల కావ‌డానికి దాదాపు మూడు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో మ‌ళ్లీ తిరిగి తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. అల్లు అర్జున్‌తో క‌లిసి దువ్వాడ జ‌గ‌న్నాథ్ సినిమ‌లో న‌టించింది.

ఈ సినిమాలో బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావ‌డంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత‌లో న‌టించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పూజా హెగ్డె తాజా ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటో షూట్‌లో కాస్తా హాట్‌గానే క‌నిపించింది ఈ భామ‌. త‌న ఎద అందాలు హైలెట్ అయ్యేలా కెమెరాకు ఫోజులిచ్చింది పూజా. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పూజా హెగ్డె ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబుతో మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తోంది. దీనితో పాటు ప్ర‌భాస్ సినిమాలో కూడా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -