Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ పై షాకింగ్ ట్విట్ పెట్టిన పూనమ్ కౌర్

- Advertisement -

పూనమ్ కౌర్ పేరు వింటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉలిక్కిపడతారు. ఆమె ప్రత్యక్షంగా పవన్ పేరు తో తిట్టన్నప్పటికి.. ఆమె చేసే ట్వీట్స్ అన్ని పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. పవన్ పై, త్రివిక్రమ్ పై ఈమెకు కోపం ఉండటానికి గల కారణాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వినిపించాయి. ఎన్నికల సమయంలో పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేసి చాలా ట్విట్స్ చేసింది పూనమ్.

పవన్ ఓడిపోయాక పూనమ్ సైలెంట్ అయింది. ఇప్పుడు పవన్ ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టబోతున్న పోరాట యాత్రకు భావన కర్మీకులందరినీ రమ్మని పిలుపు ఇచ్చిన కొద్ది గంటలకే రంగంలోకి దిగిన పూనమ్ కౌర్ ఒక షాకింగ్ ట్విట్ పెట్టింది. ’ఓ అబద్దాల కోరు రాజకీయ నాయుకుడు కాగలడు కానీ లీడర్ మాత్రం కాలేడు’ అంటూ ఆమె ఎవరు పేరు ప్రస్తావించకుండా ట్విట్ చేసింది. జస్ట్ ఏ థాట్ (ఓ చిన్నఆలోచన) అని మాత్రం పేర్కొంది.

అయితే ఈ ట్విట్ పవన్ గురించే పెట్టిందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో పవన్ కళ్యాణ్ ను పోలీన పాత్రను పెట్టి కామెడీ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు పూనమ్ కౌర్ ట్విట్ వచ్చి చేరడం సంచలనంగా మారింది. పవన్ పార్టీకి ఓట్లు పడలేదు.. అతను కూడా ఓడిపోయాడు.

అలాంటి వ్యక్తి ఒక పోరాటానికి పిలుపును ఇస్తే ఎందుకు అంత భయపడుతున్నారు అన్న కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఓడిపోయిన బాధ నుంచి కోలుకుంటూ మళ్లీ సినిమాల వైపు వెళ్తున్న పవన్ ను మానసికంగా దెబ్బ తీయడానికే ఇలాంటి ట్విట్స్ పెడుతున్నారా అన్న సందేహాలు పవన్ ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -