టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు సీక్రెట్‌గా పార్టీ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరు కలిసి రాజమౌళి కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. తమ కెరీర్‌లో సూపర్ హిట్లు ఇచ్చిన రాజమౌళికి స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌తో రాజమౌళి చత్రపతి,బాహుబలి,బాహుబలి-2 సినిమాలు తీశాడు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రభాస్ పేరు మార్మోగేలా చేశాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే తను ఈ రోజున ఇలాంటి స్టార్‌డమ్ సాధించాడు అంటే దానిలో రాజమౌళి పాత్ర చాలా ఉంది. ఎన్టీఆర్‌తో రాజమౌళి స్టూడెంట్ నెం 1,సింహాంద్రి,యమదొంగ వంటి సినిమాలు తీశాడు. ఇటీవలే రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ,రాజమౌళి కుటుంబానికి ఏ స్పెషల్ పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓ స్టార్ హోటల్‌ను కూడా బుక్ చేశారని సమాచారం. ఇక్కడి వరకు బాగానే ఉంది. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘RRRస సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. చరణ్ కెరీర్ బిగెస్ట్ హిట్ మగధీర కూడా రాజమౌళినే తెరకెక్కించాడు. మరి అలాంటి రామ్ చరణ్ ఈ పార్టీలో ఎందుకు బాగస్వామ్యం కాలేదనే అనుమానం అందరిలోనే నెలకొంది. ఈ ఇద్దరు కావలనే రామ్ చరణ్ పక్కన పెట్టారా ? లేక చరణ్‌కు తెలియకుండా ఈ పార్టీని ఏర్పాటు చేశారా అనే ప్రశ్న అందరిలోనే నెలకొంది. మరి ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!