Monday, May 20, 2024
- Advertisement -

అదిరే న్యూస్..కన్నప్ప సెట్స్ లో ప్రభాస్

- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలె మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1ని లాంచ్ చేయగా ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది.ఇక ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి వారు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియ హీరో డార్లింగ్ ప్రభాస్ అధికారికంగా సెట్‌లోకి అడుగుపెట్టారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -