Friday, May 3, 2024
- Advertisement -

అమెరికా అమ్మాయి తో ప్రభాస్ వివాహం?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరూ ముక్త కంఠం తో చెప్పే పేరు ప్రభాస్. కెరీర్ సెటిల్మెంట్ అని చెప్పి హీరోలు త్వరగా వివాహ బంధం లో కి అడుగు పెట్టరు కానీ ప్రభాస్ కి ఆ సమస్య లేదు. పదేళ్ల క్రితమే ప్రభాస్ ఇండస్ట్రీ లో స్టార్డం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ లో నే ఒక పెద్ద స్టార్ గా కూడా ఎదిగాడు. మిర్చి సినిమా టైం నుంచి ప్రభాస్ మీద పెళ్ళి చేసుకోవాలనే ఒత్తిడి ఉంది కానీ ప్రభాస్ మాత్రం ఆ విషయం పై ఒక స్పష్టత ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మొదటగా కొన్ని రోజులు పెళ్ళి ప్రస్తావన దాటవేశారు కానీ ఇంట్లో ఒత్తిడి పెరగడం తో ప్రభాస్ ఇక పెళ్ళి చేసుకోక తప్పదు అనే మూడ్ లో కి వచ్ఛేసాడు.

ఇంట్లో కూడా తన తల్లి తన కోసం మంచి సంబంధాలు చూస్తున్నారట. తాజాగా ఫిలిం నగర్ లో విన్పిస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ ఒక అమెరికా ఎన్నారై ని పెళ్ళి చేసుకోనున్నాడట. అమ్మాయి కుటుంబానికి ఇండియా లో, అమెరికా లో చాలా వ్యాపారాలు ఉన్నాయట. ప్రభాస్ కి అమ్మాయి నచ్చడం తో అమ్మాయి తరపు వాళ్ళు సాహో విడుదల కాగానే పెళ్ళి కి ముహూర్తం పెట్టించాలి అని చూస్తున్నారట.

కానీ ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -