అక్కినేని నటవారసుడు అఖిల్ కోసం కింగ్ నాగర్జున చేయని ప్రయత్నం లేదు. ఎన్ని చేసిన అఖిల్‌కు హిట్ మాత్రం రావడం లేదు. అఖిల్ నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయి. అఖిల్ ఇటీవలే నటించిన మిస్టర్ మజ్ను కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు అఖిల్. దీంతో అఖిల్‌ను కొంతకాలం సినిమాలు మానేయమని నాగ్ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికి అవి ఊట్టి రూమర్సే అని తేలాయి. అఖిల్ నాలుగో సినిమా శ్రీను వైట్ల, క్రిష్ వంటి దర్శకులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో మాత్రం క్లారీటి రావాల్సి ఉంది. తాజాగా అఖిల్‌కు హిట్ ఇవ్వడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రంగలోకి దిగుతున్నాడని తెలుస్తోంది.
అఖిల్‌తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ అఖిల్‌తో కలిసి నటించడం లేదట. అఖిల్‌ను హీరోగా పెట్టి తన ఫ్రెండ్స్ నిర్మాణ సంస్థ యూవీ క్రియోషన్స్లో ఓ సినిమా చేయడానికి చేయడానికి రెడీ అవుతున్నాడట ప్రభాస్. ఈ సినిమాకు నటుడు ఆది పినిశేట్టి సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. సత్య ప్రభాస్ పినిశెట్టి గతంలో మలుపు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోగా ఆయన తమ్ముడు ఆది పినిశేట్టి నటించాడు. ఈ సినిమా విజయం సాధించలేదు. ఇటువంటి తరుణంలో అఖిల్‌కు హిట్ ఇవ్వడానికి ప్రభాస్ రంగంలోకి దిగాడని అంటున్నారు సినీ విశ్లేషుకులు. మహేశ్,ఎన్టీఆర్‌లు ఇవ్వలేని హిట్ అఖిల్‌కు ప్రభాస్ ఇస్తాడేమో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!