- Advertisement -
దర్శకు ధీరుడు రాజమౌళి తెలుగులో భారీ భారీ మల్టీస్టారర్‌కు తెరలేపాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమాకు ప్లాన్ చేశాడు రాజమౌళి.ఈ సినిమాను ఈ నెల 11న 11గంటల 11 నిమషాలకు ప్రారంభిచనున్నారు.టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు పైగా రాజమౌళి డైరెక్షన్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే ఆడియన్స్ లో ఒకరకమైన ఆసక్తి పెరిగిపోతుంది.అయితే ఈ సినిమా ఓపెనింగ్‌కు యంగ్ రెబల్ స్టార్ రానున్నారని సమాచారం.
ప్రభాస్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని చరణ్, ఎన్టీఆర్ లపై తొలిక్లాప్ కొడతారని సమాచారం. ప్రభాస్ తో పాటు రానా, అనుష్కలను కూడా రాజమౌళి ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బాహుబలికి పని చేసిన సాంకేతిక బృందమే ఈ సినిమాకి కూడా పని చేయనుంది.డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు.