Tuesday, May 21, 2024
- Advertisement -

మొత్తానికి ప్రభాస్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు..!

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది డార్లింగ్ ప్రభాస్. గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి పై రకరకల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏ హీరోపైన రాని వార్తలు ప్రభాస్ పై వచ్చాయి. ఎన్నో పుకార్లు ఎన్నో వివాదాలు.. కానీ ఏది కూడా ఇంతవరకు తేలని విషయం. ఇది ఇప్పట్లో తేలే విషయం కాదని అందరికి తెలుసు. అందుకే ప్రభాస్ పెళ్లిపై ఏవేవో రాసేస్తుంటారు. ప్రభాస్ పెళ్లి వార్త అయితే చాలు బాగా వైరల్ అవుతుంది.

ఈ మధ్య ప్రభాస్ పెళ్లికోసం కృష్ణం రాజు ఓ అమ్మాయిని చూసేశాడని.. అనుష్కతో పెళ్లి అని తాజాగా నిహారికతో అని ఎవరికి నచ్చిన వార్తలు వారు వైరల్ చేశారు. కానీ మొత్తానికి ప్రభాస్ తన పెళ్లి వార్తలపై స్పందించాడు. ప్రభాస్ పెళ్లి గురించి.. ఆయన చేసుకునే అమ్మాయి గురించి ఇప్పటివరకు వచ్చినవన్ని పుకార్లే. స్నేహితులమేనని అనుష్క – ప్రభాస్ ఎన్ని సార్లు చెప్పినా.. వారు త్వరలో పెళ్లి చేసుకుంటారని రాసేస్తున్నారు. మెగా డాటర్ నిహారికతో పెళ్లి ఫిక్స్ అయిందని మీడియా హల్చల్ చేసేసింది.

ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ కూడా స్పందించింది. తాజాగా నిహారిక స్వయంగా ప్రభాస్ తో పెళ్లి వార్తలను తప్పని తోసిపుచ్చింది. ఇన్ని రకాలుగా హల్చల్ చేస్తున్న పెళ్లి వార్తలపై ప్రభాస్ స్పందించాడు. తనకు పెళ్లంటే అయిష్టం లేదని.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అన్నాడు. అసలు నా పెళ్లి విషయం మా ఫ్యామిలీ కంటే మీడియా వారికే ఆత్రం ఎక్కువ ఉందని కౌంటర్ వేశాడు. పెళ్లి జరగాల్సిన టైంలో జరుగుతుందని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -