బాహుబలి వంటి హిస్టరికల్ మూవీ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు యాక్షన్ టీజర్‌లకు సూపర్ రెస్పన్స్ వచ్చింది . తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ లీక్ అయింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్, శ్రద్ధా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. వైట్‌లో షర్ట్‌లో ప్రభాస్, పింక్ కలర్ డ్రెస్‌లో శ్రద్ధా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ఓ సాంగ్‌కు సంబంధించినదని తెలుస్తోంది.
యాక్షన్ టీజర్‌తో పాటు సినిమాలో రొమాన్స్ కూడా ఉందని ఈ పోస్టర్‌తో తెలిపోయింది. ఈ ఫోటో బయటికి రావడంతో ప్రభాస్ అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో పిరిడియాక్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమా 1890లో జరిగే కథ అని సమాచారం. ఈసినిమాకు జిల్ ఫేం రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. సాహో సినిమాను ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -
రొమాంటిక్ మూడ్‌లో సాహో
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -