మంచు విష్ణు ప్రధానపాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ప్రతీ సోమవారి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ వస్తున్న మంచు విష్ణు…తాజాగా కన్నప్పలో ప్రభాస్ లుక్‌ని రివీల్ చేశారు.
ప్రభాస్ మెడలో రుద్రాక్ష మాలలు ధరించి చేతిలో ఓ విచిత్ర మైన ఆయుధాన్ని ప్రభాస్ పట్టుకున్నాడు. ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ఆ పోస్టర్ లో రాసుకొచ్చారు. ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
లీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నటి కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తుండగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అడవుల్లోనే దాదాపుగా ఈ మూవీని చిత్రీకరించారు.