Tuesday, April 30, 2024
- Advertisement -

23 నిమిషాల్లో రికార్డ్ సృష్టించిన సాహో

- Advertisement -

అందరి అంచనాలకి మించి, అభిమానులందరికీ ఒక పెద్ద పండగ కి రెడీ అవ్వమని సందేశాన్ని ఇచ్చారు సాహో టీమ్. నేడు ఉదయం విడుదల అయినా టీజర్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన వాళ్ళ తో పాటు, అటు మీడియా లో, సోషల్ మీడియా లో సాహో టీజర్ గురించి, దానికి సంబందించిన మేకింగ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా చెప్పిన సమయానికి టీజర్ వదిలిన సినిమా యూనిట్ ఇప్పుడు 23 నిమిషాల్లో యూట్యూబ్ లో ఒక కొత్త రికార్డ్ ని కూడా నెలకొల్పింది.

ప్రస్తుతం తెలుగు సినిమా టీజర్స్ అన్నిటిలో సాహో టీజర్ 23 నిమిషాల్లో లక్ష లైకులని సంపాదించి ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఏ టీజర్ ఇంత తక్కువ సమయం లో ఈ ఫీట్ ని చేరలేకపోయింది. అజ్ఞాతవాసి 29 నిముషాలు, అరవింద సామెత వీర రాఘవ 32 నిముషాలు, భరత్ అనే నేను కి 35 నిముషాలు, మహర్షి కి 38 నిముషాల సమయం పట్టింది. ఈ సినిమా టీజర్లన్నిటినీ దాటుకొని సాహి టీజర్ ఈ కొత్త రికార్డ్ ని నెలకొల్పింది.

సుజీత్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తుండగా, యువీ క్రియేషన్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. సాహో ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -