Friday, May 17, 2024
- Advertisement -

‘మెర్క్యూరీ’ మూవీ రివ్యూ

- Advertisement -

మూకీ హర్రర్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మెర్య్కూరీ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్‌, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్‌ అయ్యాడా..?

కథ : కార్పొరేట్‌ ఎర్త్‌ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్‌ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్‌ కారణంగానే బాధితులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్‌ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్‌ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్‌ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్‌ చేస్తారు. ఆ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్‌ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్‌ స్క్రీన్‌ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్‌ గా, లవర్‌ భాయ్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్‌ రోల్‌లో, డిఫరెంట్‌ గెటప్‌లో చూపించి మెప్పించాడు కార్తీక్‌. సందేశాత్మక అంశాన్ని హర్రర్‌ థ్రిల్లర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు. దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానిక పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ సంతోష్ నారాయణన్‌ అందించిన నేపథ్య సంగీతం ఒక్క డైలాగ్‌ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్‌. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -