Thursday, April 25, 2024
- Advertisement -

దీపిక ఇంట మొదలైన పెళ్లి సంబరాలు..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకునే,హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ప్రేమించుకున్నారని అంద‌రికి తెలిసిందే. త్వరలోనే వీరిద్ద‌రు వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. నవంబర్ 14,15 తేదీల్లో ఇట‌లీలో వీరి పెళ్లి జరగనుండడం తెలిసిందే.పెళ్లికి పది రోజుల ముందే బెంగుళూరులోని దీపిక ప‌దుకొనె ఇంట ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. దీపిక ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో తమ కుటుంబీకులతో దీపిక ఎంజాయ్ చేస్తోంది.

శుక్రవారం దీపిక ఇంట్లో సాంప్రదాయకంగా పూజను నిర్వహించారు. దీనితో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని దీపిక సన్నిహితులు పేర్కొన్నారు. ఇటలీలో జరిగే దీపిక వివాహ వేడుకకు 200 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, డిసెంబర్ 11న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.ఇక హీరో ర‌ణ్‌వీర్ సింగ్ కూడా పెళ్లి సంద‌డిని షూరు చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -