Saturday, April 20, 2024
- Advertisement -

చెల్లెలు క్యారెక్ట‌ర్‌కు ప‌డిపోయిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో ఓడ‌లు బండ్లు అవుతాయి, బండ్లు ఓడ‌లు అవుతాయి అనే సామేత మ‌నం చాలాసార్లు విన్నాం. ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్లు , త‌రువాత అవ‌కాశాలు లేక ఫెడ్ అవుట్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఒక్క క‌న్ను కొట్టిన సీన్‌తో నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకుంది మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆమె న‌టించిన సినిమాలు ఒక‌టి కూడా విడుద‌ల కాక‌ముందే ఆమెతో ఒక్క సినిమా అయిన చేయాల‌ని తెగ ఆరాట‌ప‌డ్డారు. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింది. ఆమె న‌టించిన ఒరు ఆధార్‌ లవ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది.

సినిమాలో ఆమె న‌ట‌న కూడా ఏం బాలేద‌ని చూసిన ప్రేక్ష‌కులు తేల్చేశారు. సీన్ క‌ట్ చేస్తే ప్రియా ప్రకాశ్‌ వారియర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమెను హీరోయిన్‌గా కాకుండా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ కోసం ఓ స్టార్ డైరెక్ట‌ర్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను సంప్ర‌దించార‌ట‌. ఏంటీ ఫ్రెండ్ క్యారెక్ట‌రా..? అంటూ ఆ సినిమాను రిజెక్ట్ చేసింద‌ట‌.ఆ షాక్ నుంచి ఆమె కోలుకునేలోగా మరొకరు హీరో చెల్లెలు పాత్ర చేస్తావా , సినిమాలో అది కీ రోల్ అని కలిసారట. దీనిపై ప్రియా ప్రకాశ్‌ వారియర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ హీరో న‌టిస్తున్నాడు, పైగా సినిమాలో త‌న‌దే కీ రోల్ అని చెప్ప‌డంతో ఈ సినిమాలో న‌టించాల‌ని భావిస్తుందని స‌మాచారం. మొత్త‌నికి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుదామ‌ని ఆశించిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అఖరికి చెల్లెలు క్యారెక్ట‌ర్ చేయాల్సి వ‌స్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -