Sunday, April 28, 2024
- Advertisement -

మెగా హీరోతో సినిమా చేయ‌న‌ని చెప్పిన ప్రియా ప్రకాష్

- Advertisement -

ఒక్క క‌న్ను గీటుతో నేష‌న‌ల్ లేవ‌ల్లో పాపుల‌ర్ అయింది ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌.ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే ప‌లు సినిమాల‌లో ఛాన్స్‌లు కొట్టేసింది ఈ మ‌ళ‌యాళ బ్యూటీ.’ఒరు అడార్ లవ్’ సినిమాకి సంబంధించిన పాటలు, ప్రోమోలతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ భామ తెలుగులో వ‌చ్చిన ఓ అవ‌కాశాన్ని రిజెక్ట్ చేసింద‌ని తెలుస్తుంది.

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు అనే నూతన దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని ప్రియా ప్రకాష్ వారియర్ ని సంప్రదించారట. కానీ దానికి ఆమె అంగీకరించలేదని సమాచారం. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మాత్రమే నటించాలని ప్రియా భావిస్తోందట.దీంతోనే కల్యాణ్ దేవ్ సినిమాను రిజెక్ట్ చేసింది ఈ భామ‌.మ‌రి తెలుగులో ఆమె కోరిక‌ను తీర్చే స్టార్ హీరో ఎవ‌రో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -