పవన్ సినిమా లో ప్రియాంక అరుళ్ మోహన్..

Priyanka Arul Mohan joins Pawan Kalyan's OG film
Priyanka Arul Mohan joins Pawan Kalyan's OG film

నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. టాలీవుడ్ లో తర్వాత సినిమా శ్రీకారం. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. టాలీవుడ్ లో రెండు ఫ్లాపులతో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ‘డాక్టర్’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న ప్రియాంక, అక్కడ తన జోరు చూపిస్తోంది.

Also Read: కొత్త లుక్‍లో పవన్ కళ్యాణ్..

ఇప్పుడు ప్రియాంక అరుళ్ మోహన్ కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ(ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్‌) అనే వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న సినిమా లో ఛాన్స్ దక్కింది. నిన్న ఈ సినిమా షూటింగ్ డీవీవీ దానయ్య నిర్మాణంలో ఫస్టు షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో ప్రియాంక అరుళ్ మోహన్ జాయిన్ అయింది. ఆమెకి వెల్ కమ్ చెబుతూ చిత్రయూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.