Friday, May 9, 2025
- Advertisement -

ఏ పార్టీకి మద్దతుగా ఈ సినిమా తీయలేదు

- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ముఖ్యమంత్రిగా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘నాకు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సినిమా చేద్దాం సార్‌ అని వెంటపడేవాడిని. మహేశ్‌తో సినిమా తీయాలన్నది తన కల అని అన్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా గురించి చెప్పాలంటే ఏ పార్టీకి మద్దతుగా ఈ సినిమా తీయలేదు.

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని వివరిస్తూ తీసిన చిత్రమిది.ఈ సినిమా కథ విన్నప్పుడే దేనికీ రాజీ పడకుండా చేయాలనుకున్నాం. అసెంబ్లీ సన్నివేశాల విషయంలో కాస్త ఎక్కువగా కష్టపడ్డాం. కేవలం అసెంబ్లీ సెట్‌ కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాం. చాలా గ్రాండ్‌గా ఉంటుంది. మహేశ్‌ గారితో నాకు చనువు ఎక్కువ.మా సినిమాను ఏ పార్టీకి అప‌దించ‌వ‌ద్దు అని నిర్మాత దానయ్య చెప్పుకొచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -