- Advertisement -
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. ఈ సినిమాతో బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.
ఇక ఈ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటింది. ఈ నేపథ్యంలో పుష్ప 2లోని పలు కీలక సన్నివేశాలు, జపాన్ ఫైట్, అద్భుతమైన మాల్దీవ్స్ సీక్వెన్స్, పుష్ప డెన్, హై-స్పీడ్ రామేశ్వరం బోట్ చేజ్, మరియు శేఖావత్ చందన్ డంగ్లా లారీలను స్వాధీనం చేసుకునే క్షణం వంటివి సీన్లను వీఎఫ్‌ఎక్స్ బ్రేక్ డౌన్ పేరుతో వీడియో రిఈలజ్ చేశారు.
6 నిమిషాల ఈ వీడియోలో జపాన్ ఫైట్ మరియు రామేశ్వరం బోట్ చేజ్ వంటి ప్రధాన సీక్వెన్స్‌లు పూర్తిగా గ్రాఫిక్స్ ద్వారా ఎలా రూపొందించబడ్డాయో వివరంగా చూపించారు. మీరు ఈ వీడియోని చూసేయండి.