Saturday, May 10, 2025
- Advertisement -

“రాధ” మూవీ రివ్యూ

- Advertisement -
radha movie review

ఈ ఏడాది ‘శతమానం భవతి’ సినిమాతో కెరీర్లోనే సూపర్ హిట్ సినిమా దక్కించుకొని తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్న శర్వానంద్ చేసిన మరొక శర్వానంద్ చేసిన మరొక మూవీ ‘రాధ’. కొత్త దర్శకుడు చంద్ర మోహన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

రాధాకృష్ణ (శర్వానంద్‌) శ్రీకృష్ణుడి భ‌క్తుడు. చిన్న‌ప్పుడే దుష్ట శిక్ష‌ణ కోసం పోలీసు కావాల‌ని నిర్ణ‌యించుకొంటాడు. ఇంకా ఉద్యోగం రాక‌పోయినా పత్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌ల్ని చూసి దుష్టుల్ని శిక్షించేందుకు న‌డుం బిగిస్తుంటాడు. ఆ ప్ర‌య‌త్నం చేసి న‌లుగురు క‌ర‌డుగట్టిన నేర‌గాళ్ల‌ని పోలీసుల‌కి అప్ప‌జెబుతాడు. దాంతో రాధాకృష్ణ పేరు డీజీపీ దృష్టికి వెళుతుంది. అత‌ని తెగువ‌ని మెచ్చి డీజీపి నేరుగా పోలీసు ఉద్యోగం ఇస్తాడు. ఇక నేరగాళ్ల ప‌ని ప‌ట్ట‌డ‌మే తరువాయి అనుకొంటున్న త‌రుణంలో అస‌లు నేరాలే లేని ఓ ప్రాంతానికి పోస్టింగ్ ఇస్తాడు. దాంతో నీరుగారిపోయిన రాధాకృష్ణ ఏం చేయాలో అర్థం కాక స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. అదే స‌మయంలో ఆ ఊళ్లో అంద‌మైన అమ్మాయి రాధ (లావ‌ణ్య‌)ని చూసి మ‌న‌సు పారేసుకొంటాడు. ఆమె వెంట తిరుగుతున్న స‌మ‌యంలోనే రాధాకృష్ణ‌కి హైద‌రాబాద్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. మ‌రి హైద‌రాబాద్‌కి వెళ్లాక ఆయ‌న‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ముఖ్య‌మంత్రి కావాల‌నుకొన్న హోం మంత్రి సుజాత (ర‌వికిష‌న్‌)తో రాధాకృష్ణ‌కి వైరం ఎలా ఏర్ప‌డింది? అత‌ను చేసిన నేరాల్ని రాధాకృష్ణ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అనే విష‌యాల‌తో మిగతా సినిమా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

పక్కా కమర్షియల్ గా ఈ సినిమాని రూపొందించడమే ఈ మూవీలోని ముఖ్కమైన ప్లస్ పాయింట్. మూవీ మొదట్లో కాస్త ఆసక్తిగా ఉంది. ఇక హీరో శర్వానంద్ అయితే సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోసాడు. పోలీసాఫీసర్ అవ్వాలనే అతి తపన ఉన్న కుర్రాడిగా అతని నటన అద్భుతంగా ఉంది. అతని పాత్రకు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. కానిస్టేబుల్ షకలక శంకర్ తో కలిసి శర్వానంద్ అందించిన కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. సెకండాఫ్ సినిమా అంతా హీరో, విలన్ ల మధ్యే నడిచే సీరియస్, కామెడీ సీన్స్ వాటి మధ్యలో హీరో – హీరోయిన్లతో కూడిన కొన్ని రొమాంటిక్ సీన్స్ తో నిండి సరదాగా సాగింది. సినిమా ఆఖరున అసలు రాధ ఆ పొలిటీషియన్ ను అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పే ఎపిసోడ్స్ ఎమోషనల్ గా కాస్త టచ్ చేశాయి. సినిమాలో అసలు కథ మొదలు అయినప్పటి నుంచి చివరి వరకు ఒకే ట్రాక్లో నడవడం.. విలన్ గా రవి కిషన్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత హీరోపై రన్ చేసిన సీన్లు ఒకే విధంగా ఉంటూ మరీ ఎక్కువై కాస్త బోర్ అనిపించాయి. హీరో, హీరోయిన్ ను ప్రేమలోకి దింపడమనే సీక్వెన్స్ మరీ ఫన్నీగా తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్టాఫ్ చివరికి గాని సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం తో ఫస్టాఫ్ చాలా వరకు నీరసంగానే ఉండి రన్ టైమ్ కోసమే రూపొందించినట్టుంది. కథలోకి అసలు ట్విస్ట్ ఒకసారి తెలిసిపోయాక ఇకపై జరిగే ప్రతి సన్నివేశాన్ని చాలా సులభంగా ఊహించేయవచ్చు. పైగా కథలో కూడా కొత్తదనమంటూ ఏమీ దొరకదు. అలాగే సెకండాఫ్లో హీరో విలన్ల మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడూ హీరోదే పై చేయి అవడంతో కథనంలో దమ్ము తగ్గింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు ఏమంత గొప్పగా ఆకట్టుకోలేకపోయాయి.

మొత్తంగా :

డిఫరేంట్ పాత్రల నుండి కాస్త బ్రేక్ కోరుకుని హీరో శర్వానంద్ చేసిన కమర్షియల్ సినిమాయే ఈ ‘రాధ’. సినిమాలో కథ మొదలు అన్ని చాలా రొటీన్ గానే ఉన్నాయి. శర్వానంద్ పెర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో కనిపించే ఎమోషన్ పరర్వాలేదు అనిపించాయి. ఇక ఫస్టాఫ్ చాలా వరకు బోర్ కొట్టడం.. సెకండాఫ్ అంతా ఊహాజనితమైన సీన్లు, ఇంటర్వెల్ సమయానికి గాని అసలు కథ మొదలవకపోవడం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ ఎంటరటైనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ రాధ ఖచ్చితంగా నచ్చుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -