Friday, May 3, 2024
- Advertisement -

చిన్నారుల పాలిట దేవుడు.. సామాజిక సేవ‌తో నిజ‌మైన హీరో

- Advertisement -

త‌మిళ‌నాడు న‌టీన‌టులకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ‌. స‌మాజంలో ఏం జ‌రిగినా వెంట‌నే స్పందిస్తారు. రెండేళ్ల కింద‌ట చెన్నె వ‌ర‌ద‌ల‌కు కోలీవుడ్ అంతా స‌హాయ కార్య‌క్ర‌మాల్లో మునిగింది. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా మేమున్నామంటూ ముందుకు వ‌స్తారు. మాన‌వ సేవే మాధ‌వ సేవ‌గా భావిస్తూ సినీ అభిమానుల‌నే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌ల మ‌న‌సులు కూడా దోచుకుంటున్నాడు. అదే మాదిరి న‌టుడు, ద‌ర్శ‌కుడు, డ్యాన్స్ మాస్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ 141 చిన్నారుల గుండెల్లో నిలిచాడు. ఆయ‌న చిన్నారుల చిరున‌వ్వుల్లో న‌వ్వుగా క‌నిపిస్తున్నాడు.

అత‌డు స్థాపించిన ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్` ఎన్నో సేవా కార్యక్రమాలను చేప‌డుతున్నాడు. ఈ ట్రస్ట్ ద్వారా 141 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఉచితంగా చేయించారు. ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధ ప‌డుతుంటే త‌న‌ను సంప్ర‌దంచాల‌ని తన పర్సనల్ ఫోన్ నంబ‌ర్ ఇచ్చి పోస్టు చేశాడు. తాజాగా ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి అనిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాడు. అనిత కుటుంబసభ్యులు ఆయ‌న‌ను దేవుడిగా భావిస్తున్నారు. కూతురు చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉంటే తమకు అండగా లారెన్స్ నిలిచాడ‌ని, త‌మ‌కు మ‌రో కొడుకు దొరికాడ‌ని ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల శివాని అనే పాప గుండెలో రంధ్రం ఉండడంతో శ‌స్త్ర‌చికిత్స చేయించాడు. ఆ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో త‌న ఫేస్‌బుక్ పేజీ ద్వారా సంతోషం వ్య‌క్తం చేశాడు. ఈ విధంగా అభిమానుల గుండెల్లో ప‌దిలంగా నిలుస్తున్నాడు. లారెన్స్ తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం చేస్తూ, నృత్యాలు చేస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లు చేస్తున్నాడు.

గుండె వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు 09790750784, 09791500866 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించాడు. ఈ విధంగా వ్య‌క్తిగ‌త నంబ‌ర్లు పంచుకునే న‌టుడు ఏ సినీ ప‌రిశ్ర‌మ‌లో లేరు. అందుకే అత‌డికి ఆద్య న్యూస్ హాట్సాఫ్ చెబుతోంది. అయితే ఈ నంబ‌ర్ల‌కు నిజ‌మైన బాధితులు ఉంటేనే సంప్ర‌దించండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -