టాలీవుడ్లో రికార్డు సృష్టించిన పాటగా “రై రై రా రా” నిలిచింది. Peddi సినిమాలోని ఈ మోటివేషనల్ ట్రాక్ దక్షిణ భారత సినిమా చరిత్రలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్గా అవతరించింది.
తెలుగు వెర్షన్ ఒక్కటే 24 గంటల్లో 29.22 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పాట రామ్ చరణ్నే నటించిన “చికిరి చికిరి” (29.1M), పవన్ కళ్యాణ్ నటించిన “డెక్లెంగే సాలా” (28.53M),అల్లు అర్జున్ నటించిన “కిస్సిక్” (27.19M), అలాగే “నానా హైరానా” (23.45M) వంటి పాటల రికార్డులను అధిగమించింది.
మొత్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్ 46.1 మిలియన్ వ్యూస్, 8 లక్షలకుపైగా లైక్స్ సాధించి భారీ స్పందన తెచ్చుకుంది. దీంతో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై మరింత హైప్ ఏర్పడింది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించారు. బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న “పెద్ది”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
