Monday, May 5, 2025
- Advertisement -

ఒక హీరో కోసం కథ రాసిన మరొక హీరో

- Advertisement -

అతనే హీరో మళ్ళీ మరొక హీరోకి అతనే కథ రాసాడు. కుర్ర హీరోల్లో మంచి జోష్ లో ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు వరస హిట్ లతో సూపర్ ఆఫర్లతో చెలరేగిపోతున్నాడు. అతను మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు.

తనకి ఇష్టమైన దర్సకత్వం లోకి ఎంటర్ అవ్వాల్సిన రాజ్ అనుకోకుండా హీరోగా మారాడు మారడం మారడమే సూపర్ హిట్ లు కొట్టడంతో ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫర్లు మూట గట్టుకుంటున్నాడు. అలా అని చెప్పి డబ్బులు దొరికేసాయి కదా అని అతను సైలెంట్ గా ఉండడం లేదు. తన డైరెక్టర్ అవ్వాలి అనే కలని సుసాధ్యం చేసుకోవడం కోసం రాజ్ ఇప్పుడు హీరో సునీల్ కోసం ఒక సూపర్ కథ రాసాడు.

గోదావరి జిల్లాల నుంచి వచ్చిన చాలా మంది నటీనటుల్లో సునీల్ కూడా ఒకరు. కమెడియన్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత కామెడీ హీరోగా, అటుపై యాక్షన్ హీరోగా మారిన నటుడు సునీల్. ఇదే కోవలోనే గోదావరి జిల్లాల వచ్చిన వాడే రాజ్ తరుణ్ కూడా. కుమారీ 21 ఎఫ్ కే సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

” సునీల్ బ్రదర్ ని రీసెంట్ గా కలిసాను ఆయన తనకోసం ఏదైనా కథ రాయచ్చు కదా అన్నారు ఆయన కోసం వెంటనే ఒక కథ రాసి ఇచ్చాను అది ఆయనకీ ఇంకా చెప్పాల్సి ఉంది” అని ప్రకటించాడు. తన సినిమా ప్రచారం లో పాల్గొంటున్న రాజ్ తన కథల విషయ, విశేషాలు చెప్పడం ఆసక్తికర అంశం.కుమారి 21F తర్వాత రాజ్ తరుణ్ వంశీ మరియు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు తరుణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -