Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబుపాత్ర‌లో న‌టించే హీరో తెలుసా..?

- Advertisement -

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. అయితే ఇందులో మోస్ట్ పాపుల‌ర్ అయ‌న ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ హీరో పేరును పరిశీలిస్తున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. రాజశేఖర్.

‘గరుడ వేగ’ హిట్ తర్వాత రాజశేఖర్ మరే సినిమాకు సంతకం చేయలేదు. ‘గరుడ వేగ’ సినిమా ప్రమోషన్ సమయంలో.. తనకు బాలకృష్ణ సినిమాలో చిన్న పాత్రలో అవకాశం ఇచ్చినా నటిస్తానని రాజశేఖర్ అన్నారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. చిన్న పాత్ర ఎందుకు? కలిసి మల్టీ స్టారర్‌ చేద్దామని తెలిపారు.

ఇటీవల ‘ఎన్టీఆర్’ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సినిమాలో పాత్రల ఎంపిక కోసం జరిగిన చర్చలో రాజశేఖర్‌కు సీఎం చంద్రబాబు పాత్ర ఇస్తేనే బాగుంటుందని బాలయ్య అభిప్రాయపడ్డారట. మరి, ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో రాజశేఖర్ ఉంటారా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -