Sunday, May 5, 2024
- Advertisement -

హమ్మయ్య రజినీకాంత్ కదిలాడు

- Advertisement -

కబాలి ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడప్పుడే బయటపడడు అనుకున్న హీరో రజినీకాంత్ వెంటనే తన తరవాతి సినిమా రోబో 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. తాను ఎప్పటి నుంచో శంకర్ తో సినిమా చెయ్యాలి అనుకున్న రజిని నాలుగు నెలల క్రితం కబాలి షూటింగ్ ఐన తరవాత శంకర్ తో రోబో సేక్వేల్ గ 2.0 షూటింగ్ మొదలు పెట్టాడు.

అయితే ఆరోగ్య రిత్యా, పర్సనల్ కారణాల వలన అమెరికా వెళ్ళిన రజినీకాంత్ కబాలి విడుదల తరవాత కనీ రాలేదు. తమిళనాడు లో పరవాలేదు అన్నట్టుగా ఆడిన కబాలి తెలుగు లో మాత్రం దారుణమైన ప్లాప్ గా నిలిచింది. ఇకక్డ డిస్ట్రిబ్యూటర్ లకి ఈ చిత్రం ఒక పెద్ద డిజాస్టర్ గా మారింది. ‘కబాలి’ విడుదలకు ముందు రజినీ అనారోగ్యంతో దాదాపు రెండు నెలలు అమెరికాలో గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికొచ్చి కూడా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు.

ఐతే ఎట్టకేలకు ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నారు. రజినీ కోసం హోల్డ్ లో పెట్టిన ‘రోబో-2’ షూటింగ్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెలాఖరు నుంచి ‘2.0’ కొత్త షెడ్యూల్ ఆరంభం కాబోతోంది. రజినీ రోబో మేకప్ తో షూటింగులో పాల్గొనబోతున్నారు. రజినీ ఈ సినిమా షూటింగుకి దూరంగా ఉన్న రోజుల్లో వేరే నటులతో తలకోనలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు శంకర్. దీంతో పాటు విజువల్ ఎఫెక్టుల పనులూ చూసుకున్నాడు. ఇప్పుడు రజినీ రెడీ అయిపోవడంతో మూడు నెలల పాటు వరుసగా షెడ్యూళ్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -