తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజలు నుంచి ఆమె రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో సౌందర్య వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. రజినీకాంత్ కొందరు ప్రముఖులను స్వయంగా కలుసుకొని మరీ పెళ్లి శుభలేఖలను అందిస్తున్నారట. తాజాగా సౌందర్య తనకు కాబోయే భర్తన అభిమానులకు పరిచియం చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ వనంగమూడితో సౌందర్య రెండో పెళ్లి జరగనుంది.విషాగన్ వనంగమూడిను అభిమానులకు పరిచియం చేస్తు తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో చూసిన నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. అశ్విన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సౌందర్య. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకు వీరి మధ్య విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుంది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాబు సౌందర్య దగ్గరే ఉంటున్నాడు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ